Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
ప్రతిఒక్కరూ జలసాక్షరతను కలిగి ఉండాలని తెలంగాణ వాటర్రీసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ వీరమల్ల ప్రకాష్‌రావు అన్నారు.సోమవారం మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన జలసాక్షరత అనే అంశంపై జరిగిన ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భూమిమీద నీరు 71శాతం భూమి 29 శాతం ఉన్నప్పటికీ దానిలో 3 శాతం మాత్రమే మంచి నీరన్నారు.అందులో రెండు శాతమే ధ్రువాలను మంచు రూపంలో ఉన్నదని ఇక మిగిలిన ఒక్క శాతమేనన్నారు.భూమి వాతావరణంలో కాలుష్యం పెరగడం వల్ల భూమిపై వేడి పెరిగిపోతుందని, దానివల్ల భూమిలోని చెమ్మ తొలగిపోయి పంటలకు పనికిరాకుండా పోవడ మేకాక ఎడారులుగా మారిపోయే ప్రమాదం ఉందన్నారు.అంతేకాక ధ్రువప్రాంతాల్లో ఉన్న మంచు క్రమేణా కరిగిపోయి సముద్ర నీటిమట్టం పెరిగి తీరప్రాంతాలలో ఉన్న నివాసాలన్ని మునిగిపోయే ప్రమాదం ఉందన్నారు.మానవమనుగడకు జలంఎంతో అవసరమన్నారు.పంటలు పండాలంటే జలం అవసరమని జలన్ లేకపోవడం వల్లనే రైతులు పంటలు పండించలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయన్నారు.అందుకే అందుబాటులో ఉన్న జల వనరులకు సంబంధించిన పరిజ్ఞానం అందరికీ అవసరమని ఆ జలాన్ని ఎలా ఉపయోగించుకోవాలో కూడా తెలియాలన్నారు. అందుకే అందరూ జలసంరక్షణ విధానాలను పాటించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర చీఫ్ రిటైర్డ్ ఇంజనీర్ ఎం.శ్యామ్‌ప్రసాద్ మాట్లాడుతూ మన దేశంలో నీటి సంరక్షణ విధానాలను పాటించడంలో వెనుకబడి ఉన్నామన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జల సంబంధమైన ఎన్నో ప్రాజెక్టులను రూపకల్పన చేసుకోవడం వల్ల తాగునీరు, సాగునీర ందించగలుగు తున్నామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇది జరగలేదన్నారు. ఎస్సెల్బీసీ ప్రాజెక్టు తర్వాత ఫ్లోరైడ్ నీటితో బాధపడుతున్న ప్రాంతాలకు నేడు స్వచ్ఛమైన జలాలు అందుబాటులోకి వచ్చాయన్నారు.డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డి రిటైర్డ్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతే రాష్ట్రాల్లో జలం అందుబాటులోకి వచ్చిందని. జలసాధన సమితి ఉద్యమమే నీటి ఉద్యమాలకు అంకురార్పణ జరిగిందన్నారు.ఉపకులపతి ఆచార్య గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ నీటి సంరక్షణ విధానాలను పూర్తి స్థాయిలో లేవన్నారు. జల సంబంధమైన పరిజ్ఞానాన్ని అందరికీ అందు బాటులోకి తీసుకురావాలన్నారు.సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా బాల్యం నుండి జలసంబంధమైన ఇటువంటి విషయాల పట్ల అవగాహన కలిగించాలన్నారు.ఈ కార్యక్రమంలో మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ దోమల రమేశ్ అతిథులను ఆహ్వానించగా ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎల్మధు వందన సమర్పణ చేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ కె.అంజిరెడ్డి, డాక్టర్ కె.శ్రీదేవి, డాక్టర్ ఆకుల రవి, డాక్టర్ అల్వాలరవి, డాక్టర్ శ్యామ్‌సుందర్,డాక్టర్ కేవీ.శశిధర్, పండరయ్య, డాక్టర్ ప్రేమ్‌సాగర్, డాక్టర్ శివరామ్, డాక్టర్ వై.ప్రశాంతి, వివిధడిపార్టుమెంట్లకు చెందిన అధ్యా పకులు, విద్యార్థులు, పర్యావరణ ప్రేమికుడు సురేష్‌గుప్తా పాల్గొన్నారు.