Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
అకాలవర్షాలతో తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని మద్దతుధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు సోమవారం పట్టణంలోని మెయిన ్సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు.రాస్తారోకోకు సీపీఐ(ఎం), కాంగ్రెస్ మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కందాల ప్రమీల, టీపీసీసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దైద రవీందర్ మాట్లాడుతూ నకిరేకల్ మార్కెట్‌యార్డుకు ధాన్యాన్ని తీసుకొచ్చి రోజులు గడుస్తున్నా అధికారుల నిర్లక్ష్యంతో కొనుగోలు త్వరితగతిన నిర్వహించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.మండలంలోని కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న పరిస్థితిని ఈ సందర్భంగా జిల్లా స్థాయి ఉన్నత అధికారులకు వివరించారు.అధికారులు వచ్చి సమాధానం చెప్పే వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించికూర్చున్నారు.తహసీల్దార్ ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకొని ధాన్యాన్ని తడిసినధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా మిల్లర్లతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల, పట్టణ కార్యదర్శులు రాచకొండ వెంకట్‌గౌడ్,వంటెపాక వెంకటేశ్వర్లు,మాజీ ఎంపీపీ మర్రి వెంకటయ్య, సాకుంట్లనర్సింహ,ఆదిమల్ల సుధీర్, జమదగ్ని, కాంగ్రెస్ నాయకులు ఎండి. యూసుఫ్, ఎండి.రియాజ్‌ఖాన్, ప్రమోద్‌కుమార్, పందిరి సతీష్, రైతులు పాల్గొన్నారు.