Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరుటౌన్
మండల కేంద్రంలో మంగళవారం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థిని, విద్యార్థులకు సైబర్ క్రైం పై అవగాహనా సదస్సు ఎస్ఐ ఎండి.ఇద్రిస్ అలీ ఆధ్వర్యంలో నిర్వహించారు . సైబర్ క్రైమ్ అంబాసిడార్లుగా మేఘన ,ఇషాంత్‌లకు, బ్యాడ్జీలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ నారాయణ ఎస్ ఎం ఎస్ చైర్మెన్ గోవర్ధన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
భూదాన్‌పోచంపల్లి : సమాజంలో జరుగుతున్న నేరాaఱ, మోసాలపై ప్రజలు విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎస్ఐ సైదిరెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, సైబర్ అంబాసిడర్లు సిరి ,భావన, సైబర్ టీచర్ వీర బ్రహ్మచారి, ఉపాధ్యాయులు రాధా రాణి, కవిత నాగమణి, తదితరులు పాల్గొన్నారు.