Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
ఆలేరు మాజీ శాసనసభ్యులు, జిల్లా జెడ్పీ ఫ్లోర్‌లీడర్ , ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ కేె.నగేశ్ ను మంగళవారం ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మండల కోఆప్షన్ సభ్యులు ఎండి. గౌస్ , కాంగ్రెస్ నాయకులు పోత్నాక్ ప్రమోద్ కుమార్, పల్లె సంతోష్ , జహంగీర్,కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.