Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ రామన్నపేట
రామన్నపేట - అమ్మనబోలు రూట్లలో విద్యార్థుల సంఖ్యకను గుణంగా ఆర్టీసీ బస్సులను నడపాలని ఎస్ఎఫ్ఐ మండల అద్యక్ష, కార్యదర్శులు మేకల జలందర్, బండ్ల పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. మంగళవారం విద్యార్థులతో కలసి స్థానిక తహసిల్థార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం తహసీల్థార్ ఆంజనేయులుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామన్నపేట అమ్మనబోలు రూట్లలో దుబ్బాక, మునిపంపుల, పల్లివాడ, ఎన్నారం, కుంకుడుపాముల, బాచుప్పల, సూరారం, తుర్కపల్లి గ్రామాల విద్యార్థులు 500మంది వివిద మండల కేంద్రంలో కళాశాలల్లో చదువుతున్నారన్నారు.. బస్సులు ఒక్కటి కూడా రాకపోవడంతో విద్యార్థులు నిత్యం ప్రయివేటు వాహనాలను ఆశ్రయిస్తూ ఆర్థికంగా నష్టపోతూ విద్యకు దూరం కావలసివస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం మండల నాయకులు కె.వినరు, కళ్ళెం మహేష్, కల్లూరి శివ, భూడిద గణేష్, ఆదిత్య, ఉదరు, తుర్కపల్లి శ్రావణి, స్వాతి, మమత, శ్వేత తదితరులు పాల్గొన్నారు.