Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొండమల్లేపల్లి : అమ్మాయిలను , మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా షీటీం ఎస్ఐ సాలకమ్మ అన్నారు. మంగళవారం పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీటీం అవగాహనా కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. పాఠశాలలు, రోడ్లపై, బస్టాండ్, బస్టాప్ల్లో యువకులు మహిళలను,అమ్మాయిలను వేధిస్తే నేరుగా షీ టీమ్ నెంబర్ కుఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. వెంటనే అక్కడికి పోలీసులు వచ్చి ఆకతాయిల పై చర్యలు తీసుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ భాస్కర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు మంద సత్యనారాయణ, ఉపాధ్యాయులు శ్రీనివాసులు, సరస్వతి, కొర్ర లొక్య నాయక్ ,నల్ల నరసింహ, వెబ్ నైజర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.