Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వలిగొండ : మండలంలోని వెల్వర్తి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు తక్కిళ్ళ సంజీవ మరణం పార్టీకి తీరని లోటని ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం వెల్వర్తి స్వగ్రామంలో సంజీవ మతదేహాన్ని ఆయన సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అన్నా మేరీ బాలశౌరి, మార్కెట్ చైర్మెన్ కొనపురి కవిత, సింగిల్విండో చైర్మెన్ సురకంటి వెంకట్రెడ్డి, ఆ పార్టీ మండల అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి, మాజీ జెడ్పీటీసీ మొగుళ్ళ శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి మామిళ్ల రత్నయ్య, సోషల్ మీడియా కన్వీనర్ కూచి మల్ల సుధాకర్ ,ఐటి పాముల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.