Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -చిట్యాల
మండలంలోని ఏపూర్ గ్రామ మండల ప్రజా పరిషత్ పాఠశాలను మంగళవారం గ్రామ సర్పంచ్ పాలెం మాధవి మల్లేష్ సందర్శించారు . అనంతరం మధ్యాహ్న భోజనం అమలు తీరును పరిశీలించారు. విద్యార్థులకు భోజనాలు వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సుర్గి లింగస్వామి, వార్డు సభ్యులు ,ప్రధానోపాధ్యాయులు సైదులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.