Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
పట్టణకేంద్రంలో మంగళవారం బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ జన్మదినం సందర్భంగా ఆ పార్టీ మండలకమిటీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీచేశారు. అనంతరం ప్రభుత్వాసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీచేశారు. అంతకుముందు రక్తదానంచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పల్లె లింగస్వామి, కత్తుల పరమేశ్, తగరం సుభాశ్‌చంద్రబోస్, బల్కె నర్సింహా, కత్తుల పద్మ, గాదె సంతోష, సుక్క ప్రమీల, కత్తుల నర్సింహా, సుక్క బుగ్గరాములు, చామట్ల రమేశ్, శివ, లింగస్వామి, లావణ్య, పారిజాత, భాస్కర్ పాల్గొన్నారు.