Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ యాదాద్రి అదనపు కలెక్టర్ దీపక్ తివారి
నవతెలంగాణ-మోత్కూర్
గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకుని పోషకాహార లోపాలు అధిగమించాలని యాదాద్రి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. ఐసీడీఎస్ మోత్కూరు ప్రాజెక్ట్ కార్యాలయంలో మంగళవారం పోషన్ అభియాన్ పై భువనగిరి, ఆలేరు, రామన్నపేట, మోత్కూర్ ప్రాజెక్టుల పరిధిలోని సీడీపీవోలు, సూపర్ వైజర్లు, పోషన్ అభియాన్ టీం సభ్యులకు అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్ వాడి కేంద్రాల ద్వారా ఇస్తున్న పోషకాహారం పక్కదారిపెట్టకుండా విధిగా లబ్దిదారులకు అందించాల న్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ జిల్లా అధికారి కష్ణవేణి, మండల ప్రత్యేక అధికారి యాదయ్య, ఎంపీడీవో పోరెడ్డి మనోహర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ షేక్ మహమూద్, ఎంపీవో సురేందర్ రెడ్డి, పోషన్ అభియాన్ టీం జిల్లా కోఆర్డినేటర్ సుజాత, సీడీపీవోలు జోత్స్న, స్వరాజ్యం, శైలజ, చంద్రకళ, సూపర్వైజర్లు కె.మంగమ్మ, అండాలు, విజయలక్ష్మి, జ్యోతి, మధురమ్మ, రవి, ఆశమ్ తదితరులు పాల్గొన్నారు.