Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఆలేరుటౌన్
పోచంపల్లి పట్టణంలో డిసెంబర్ 5,6 ,7 తేదీల్లో జరగనున్న సీపీఐ(ఎం) జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగ నర్సింహులు కోరారు .మంగళవారం మండలకేంద్రంలోని ఏసీ రెడ్డి భవన్ లోమండల సమావేశం సుధ గాని సత్యరాజయ్య అధ్యక్షతన నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలతో మమేకమై ,ప్రజల కోసం పోరాడుతూ పదవులు ఉన్నా లేకపోయినా ప్రజలే ముఖ్యమని ముందుకు దూసుకుపోతున్న సీపీఐ(ఎం) జిల్లా మహాసభలు పోచంపల్లి లో జరుగుతున్నాయని తెలిపారు . ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి దూపటి వెంకటేష్, మాజీ మండల కార్యదర్శి మెరిగాడి రమేష్, మండల కార్యదర్శి వర్గ సభ్యులు సత్యరాజయ్య, పిక్క గణేష్, బుగ్గ నవీన్, మండల కమిటీ సభ్యులు నల్లమాస తులసయ్య, బోడ భాగ్య తదితరులు పాల్గొన్నారు.