Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ బ్యాంకులు ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలి
అ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ -భువనగిరిరూరల్
అర్హులైన లబ్దిదారులకు సకాలంలో రుణాలు అందించాలని, వారి ఉన్నతికి తోడ్పడాలని, తద్వారా ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి బ్యాంకు ప్రతినిధులకు సూచించారు.మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాంకుల 2021-22 అర్ధ వార్షిక ప్రగతి సమీక్షలో ఆమె మాట్లాడుతూ 2021- 22 సంవత్సరం గడిచిన అర్ధ వార్షిక ప్రగతికి సంబంధించి రూ.2937 కోట్లకు గాను రూ.1170 కోట్లు అందించి 40 శాతం ప్రగతి సాధించినట్టు తెలిపారు. వ్యవసాయ దీర్ఘకాలిక రుణాల కింద రూ.47 కోట్లా 83 లక్షల లక్ష్యానికి రూ.11 కోట్లా 50 లక్షలు సాధించినట్టు తెలిపారు. పంట రుణాలకు సంబంధించి రూ.83 కోట్లా 50 లక్షలకు రూ.59 కోట్ల్లా 13 లక్షల రుణాలు అందించి 71 శాతం సాధించినట్టు తెలిపారు. సూక్ష్మరుణ ప్రగతిలో రూ.14 కోట్లా 66 లక్షల లక్ష్యానికి గాను 3009 మంది లబ్దిదారులకు రూ.9 కోట్లా 82 లక్షలు అందించి 67 శాతం సాధించినట్టు తెలిపారు. విద్యా రుణాల కింద రూ.21 కోట్లా 82 లక్షలకు ఇప్పటివరకు 116 మందికి రూ.7 కోట్లా 13 లక్షలు అందించినట్టు తెలిపారు. వీధి వ్యాపారులకు జిల్లా లోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో 9098 మందికి గాను 8637 మందికి పది వేల రూపాయల చొప్పున రుణం అందించి 95 శాతం సాధించినట్టు తెలిపారు. స్వయం సహాయక మహిళా సంఘాలకు సంబంధించి జిల్లాలో మొత్తం 13,136 గ్రూపులకు రూ.38 కోట్లా 75 లక్షలకు గాను 5664 గ్రూపులకు రూ. 21 కోట్లా 91 లక్షలతో 61 శాతం ప్రగతి సాధించినట్టు తెలిపారు. అర్హులైన వారికి రుణాలు అందించడంలో భాగంగా కొత్తగా వచ్చే పరిశ్రమలకు రుణ అవకాశాలు కల్పించాలని సూచించారు. విద్యార్థులకు ఫైనాన్షియల్ లిటరసీ అవగాహన కార్యక్రమాలలో భాగస్వాములను చేసి విద్యార్థి దశ నుండే ద్వారా విద్యార్థుల స్థాయి నుండి బ్యాంకింగ్ వ్యవస్థ పై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. రుణాలు తీసుకున్న సంఘాలు, వీధి వ్యాపారులు వారు తిరిగి చెల్లించేలా అధికారులు క్షేత్రస్థాయిలో పని చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు రుణాలు సకాలంలో గ్రౌండింగ్ చేపట్టాలన్నారు. నాబార్డు శాఖచే రూపొందించిన పొటెన్షియల్ లింక్డ్ ప్లాన్ బ్రోచర్లను జిల్లా కలెక్టర్, బ్యాంకు ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్డీవో పూర్ణిమ, జిల్లా లీడ్ మేనేజర్ రామకష్ణ, కెనరా బ్యాంక్ డీఎం శ్రీనివాస్, ఎసబీఐ. బ్యాంకు డీఎం రఘోత్తమ రావు, నాబార్డ్ మేనేజర్ సత్యనారాయణ, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, వివిధ సంక్షేమ శాఖల అధికారులు, పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొన్నారు.