Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి
నవతెలంగాణ- మునుగోడు
కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని తేమ శాతం పేరుతో నిర్లక్ష్యం వహించకుండా వెంటనే కొనుగోలు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి అన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా తడిచిన ధాన్యమును ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలో ఉండి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ యాసంగి పంట సాగు పై స్పష్టత ఇవ్వకుండా కాలయాపన చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వలు యాసంగి పంట సాగు పై స్పష్టత ఇవ్వాలని , సారవంతమైన భూములలో వరి సాగు చేసుకునేందుకు ప్రభుత్వం ఆదేశాలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం, మండల కార్యదర్శి చాపల మారయ్య , యాసరాణి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.