Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరి
ప్రపంచ పర్యాటక దినోత్సవ ఉత్సవాల్లో భాగంగా వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి మంగళవారం మున్సిపల్ మీటింగ్ కార్యాలయంలో కలెక్టర్ పమేలా సత్పతి బహుమతులు ప్రదానం చేశారు. సెప్టెంబర్ నెల 23 నుండి 27వరకు నిర్వహించిన ప్రపంచ పర్యాటక ఉత్సవాలలో భాగంగా హెరిటేజ్ వాక్ భువనగిరి ఖిల్లా పై సుమారు 150 మందితో, 120 మంది తో సైకిల్ ర్యాలీ ,150మంది తో భువనగిరి ఖిల్లా వద్ద స్వచ్ఛత పఖ్వాడా 27 న స్థానిక భువనగిరి ఖిల్లా వద్ద సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రపంచ పర్యాటక ఉత్సవాలల్లో భాగంగా నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో గెలుపొందిన వారికి జిల్లా కలెక్టర్పమేళా సత్పతి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమలో జిల్లా పర్యాటక శాఖ అధికారి, బాలాజీ, జయశ్రీ, అంజయ్య, డీఐఓ సంజీవ , డీఈఓ ఆఫీస్ సిబ్బంది జోసెఫ్ పాల్గొన్నారు.