Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
నవతెలంగాణ -మునుగోడు
ముఖ్యమంత్రి కెేసీఆర్ ఢిల్లీ పర్యటనతో రైతులకు ఒరిగిందేమీ లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఐకేపీ కేంద్రాలను ఆయన సందర్శించి మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించారు, వడ్లను కొనుగోలు చేయడంలో అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తేమ శాతం పేరుతో కొనుగోలు చేయడం లేదని పలువురు రైతులు గోడును వెళ్లబోసుకున్నారు. అనంతరం స్థానిక పీఏసీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యాసంగి వడ్లు కొనుగోలు చేయాలని తెలంగాణ మంత్రులతో ఢిల్లీకి వెళ్ళిన కేసీఆర్కు ఇంతవరకు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ దొరకలేదన్నారు. ఆరుగాలం కష్టపడి శ్రమించి పండించిన పంటను ఐకేపీ కేంద్రాల్లో పోస్తే కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 7 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారిని ఆదుకొని కేసీఆర్ ఢిల్లీలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు మూడు లక్షల పరిహారం ఇవ్వడం విడ్డూరమన్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలోని రైతుల అందరికీ ఒకేసారి రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని కోరారు .ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మెన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి ,కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పాల్వాయి గోవర్ధన్ రెడి, ్డ ఆయా గ్రామాల కాంగ్రెస్ సర్పంచులు ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.