Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ డీజీపీ మహేందర్ రెడ్డి
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
తనకు ఇంత గొప్ప జీవితాన్ని అందించినది సర్వేల్ గురుకులం అని, ఎప్పటికి మరచిపోలేని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు .మంగళవారం మండలంలోని సర్వేలు గురుకుల పాఠశాలలో నిర్వహించిన స్వర్ణోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సర్వేలు గురుకుల పాఠశాలను స్థాపించి నేటికి 50 ఏండ్లు పూర్తయిందన్నారు. ఈ పాఠశాలలో చదివిన తనకు తోటి విద్యార్థులకు సర్వేలు మంచి జీవితాన్ని అందజేసిందన్నారు. సర్వేలు అంటేనే తన జీవితం అన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులు ఒకే చోట కలిసి ఉండి ఉన్నతమైన, విలువలతో కూడిన విద్యను నేర్చుకునేందుకు అప్పటి ముఖ్యమంత్రి ,మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఈ పాఠశాలను స్థాపించి నేటికి 50 ఏండ్లు పూర్తయిందన్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటుచేసిన ఈ పాఠశాల అనేక గురుకుల పాఠశాలల ఏర్పాటుకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు. సర్వేల్ గురుకుల పాఠశాల విద్యార్థులు ఎంతోమంది ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నారు. అందుకు పాఠశాలలో విద్యా బోధన చేసిన అధ్యాపకులు అందించిన ఉత్తమ విద్యనే ప్రధాన కారణమన్నారు. ఇదే స్ఫూర్తితో విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలన్నారు. పరీక్షల్లో పాస్ అయ్యేందుకు చదవడమే కాకుండా విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకొని సమాజ సేవకు ఉపయోగపడే విధంగా ఎదగాలన్నారు. విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదిగిన అప్పుడే సర్వేలుకు సార్ధకత ఉంటుందన్నరు. ఈ క్రమంలో అల్యూమినియం అసోసియేషన్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి, కార్యదర్శి రాజారెడ్డి ఉపాధ్యక్షులు మల్లేష్ పలువురు పూర్వ విద్యార్థుల, అధ్యాపకులు పాల్గొన్నారు.