Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
బీజేపీని బూతుస్థాయి నుండే బలోపేతం చేయాలని ఆ పార్టీ జిల్లా ఇన్ఛార్జీ నందకుమార్ యాదవ్ తెలిపారు. మంగళవారం చౌటుప్పల్ పట్టణకేంద్రంలోని పద్మావతి ఫంక్షన్హాల్లో మండల, మున్సిపల్ కమిటీల సమావేశం పట్టణ అధ్యక్షులు ఉడుగు వెంకటేశంగౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బూతు స్థాయిలో పూర్తిగా కమిటీలు వేయాలని సూచించారు. 2023లో బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చూడాలన్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు రమణగోని శంకర్, నాయకులు నకిరేకంటి మొగులయ్య, దూడల బిక్షంగౌడ్, గుజ్జుల సురేందర్‌రెడ్డి, రిక్కల సుధాకర్‌రెడ్డి, ఆలె చిరంజీవి, దాసోజు బిక్షమాచారి, పాలకుర్ల జంగయ్యగౌడ్, ఉడుగు యాదయ్యగౌడ్, కాయితి రమేశ్‌గౌడ్, పోలోజు శ్రీధర్‌బాబు, బండమీది మల్లేశం, ఆలె నాగరాజు, ఉప్పు అంజనేయులు, నూనె మాధవి, చినుకని మల్లేశం, కడారి అయిలయ్య, కల్పన, కడవేరు పాండు, వనం ధనుంజయ, బుడ్డ సురేశ్, లింగాల వెంకటేశం, మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.