Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ డీసీపీ నారాయణరెడ్డి
అ శరాజిపేటలో కార్డన్‌సెర్చ్
నవతెలంగాణ -ఆలేరు రూరల్
ప్రజలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తే వాటిని వెంటనే మానుకోవాలని డీసీపీి నారాయణ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని శరాజిపేట గ్రామంలో రాచకొండ కమిషనరేట్ ఆధ్వర్యంలో కార్డెన్‌సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఏసీపీ, ముగ్గురు సీఐలు, 15 మంది ఎస్ఐలు, 140 మంది పోలీస్ సిబ్బంది గ్రామంలో రెండు గంటలపాటు సోదా చేయగా 26 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, 2 సిలిండర్లు, 15000 విలువ చేసే మద్యం పట్టుకున్నట్టు తెలిపారు. ఆలేరు నుండి మోత్కూర్ వెళ్లే రోడ్డు మీద ఈ గ్రామం ఉండడంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్డెన్ సెర్చ్ కు గ్రామస్తులు సహకరించినందుకు కతజ్ఞతలు తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ కోట్ల నర్సింహారెడ్డి ,సీఐ నవీన్ రెడ్డి ,ఎస్ఐ లు ఇద్రిస్ అలీ ,నాగరాజు, శ్రీధర్ రెడ్డి ,వెంకన్న ,కానిస్టేబుల్ లు వెంకటేష్, నవీన్ ,ప్రదీప్ ,విజయలక్ష్మి ,మల్లికా ,స్వప్న, సైదులు, నరసింహ, విజరు, కుమార్ ,నరసింహ, రమేష్ ,నరేష్ తదితరులు పాల్గొన్నారు.