Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నకిరేకల్
ప్రతి కల్లుగీత కార్మిక కుటుంబానికీి మూడెకరాల భూమితో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చౌగొని సీతారాములు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక నర్రా రాఘవరెడ్డి భవనంలో నిర్వహించిన ఆ సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 27న పట్టణంలోని కేఆర్ ఆడిటోరియంలో కల్లుగీత కార్మిక సంఘం నియోజకవర్గ స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సదస్సుకు గీత కార్మికులు సకాలంలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. గీత కార్మికుల కుటుంబాలలో 50 శాతానికి పైగా నిరుపేదలు ఉన్నారని, ఆ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి రాచకొండ వెంకట్ గౌడ్, మండల కార్యదర్శి కొప్పుల అంజయ్య, ప్రతినిధులు ఎరుకలి అంజయ్య, గుడు గుంట్ల బుచ్చి రాములు, పుట్ట ముత్తి రాములు, పుట్ట సత్తయ్య పాల్గొన్నారు.