Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ డీసీసీ జిల్లా అధ్యక్షులుకుంభం అనిల్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ -భూదాన్‌పోచంపల్లి
ధాన్యాన్ని వేగవంతం చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా మార్కెట్లో పోసిన ధాన్యాన్ని తూకం చేసేలా చర్యలు చేపట్టాలని యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని జూలూరు మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రైతులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి 50రోజులు అవుతున్నా కొనుగోళ్లు మందకోడిగా సాగుతున్నాయి. అకాలవర్షానికి ధాన్యం తడిసి మొలకెత్తి నష్టపోతున్నారన్నారు. కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు పాక మల్లేష్ యాదవ్, మండల ఉపాధ్యక్షుడు కాసుల అంజయ్య రైతులు పాముకుంట్ల దయాకర్, కొత్తపల్లీ ఐలయ్య, నరసింహ ,బొచ్చుబాలయ్య, దుర్గం నరసింహ పాల్గొన్నారు.