Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి
నవతెలంగాణ -ఆలేరుటౌన్
అంగన్వాడీ కేంద్రాల విలీనం వెంటనే ఆపాలని, ఐసీడీఎస్ ను యథావిధిగా కొనసాగించాలని, పెంచిన పీఆర్సీ వేతనాలు ఇతర సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారంన స్థానిక ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆఫీసులో సూపర్వైజర్ ఉమారాణికి వినతి ప్తరం అందజేశారు. ఈ సందర్భంగా చంద్రారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీప్రభుత్వం తెచ్చిన నూతన జాతీయ విద్యావిధానాన్ని అమలు చేసే కుట్రలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న 14,000 అంగన్వాడీ సెంటర్లను ప్రభుత్వ పాఠశాలల్లో విలీనం చేసేందుకు తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం పెంచిన వేతనాలు 2018 అక్టోబర్ నుండి చెల్లించేందుకు బడ్జెట్ వెంటనే విడుదల చేయాలని , మినీ అంగన్వాడీ టీచర్లను మెయిన్ టీచర్లుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి పౌల్, అంగన్వాడీ యూనియన్ ఆలేరు ప్రాజెక్ట్ అధ్యక్ష, కార్యదర్శులు ఎ. పద్మ, జి. రమ, నాయకురాళ్ళు డి. అనురాధ, సునీత, టి. శారద తదితరులు పాల్గొన్నారు.