Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
మున్సిపల్ పరిధిలోని లింగోజిగూడెంలోని 3వ వార్డులో మున్సిపల్ నిధులు 8 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న వైకుంఠధామం నిర్మాణ పనులను గురువారం వార్డు కౌన్సిలర్ బండమీది మల్లేశ్ సందర్శించి, పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డులో మిగిలి ఉన్న సమస్యలను అంచెలంచెలుగా పరిష్కారం చేస్తామన్నారు. వార్డు అభివద్ధి కోసం శాయశక్తులా కషిచేస్తానని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం తాను ముందుండి పనిచేస్తానన్నారు.