Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జిల్లా అదనపు కలెక్టర్ వనమాల చంద్రశేఖర్
నవతెలంగాణ- నార్కట్పల్లి
రైతులు ఆరుగాలం కష్టించి పండించి కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ వనమాల చంద్రశేఖర్ పీఏసీఎస్, ఐకేపీ కేంద్రాల కొనుగోలు కమిటీలను ఆదేశించారు. గురువారం మండల పరిధిలోని చౌడంపల్లి, బ్రాహ్మణ వెల్లంల ఐకేపీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాలతో ధాన్యం తడవకుండా రైతులు జాగ్రత్తగా టార్పాలిన్లు కప్పి పెట్టుకోవాలన్నారు. రైతులు 17 శాతం వచ్చేలా ధాన్యం ఆరబెట్టుకోవాలన్నారు. మద్దతు ధర పొందాలని సూచించారు., కొనుగోలు చేసిన ధాన్యం రైతుల వివరాలు వెంటనే ట్యాబ్లో ఎంట్రీ చేసి ధాన్యం డబ్బులు వెంటనే ఖాతాలో పడే విధంగా చూడాలని ఆదేశించారు. . రైతులు వారి ఖాతాకు ఆధార్,మొబైల్ లింక్ చేసుకున్నట్లైతే చెల్లింపులకు ఇబ్బంది ఉండదని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివద్ధి అధికారి కలిందిని , జిల్లా సివిల్ సప్లై అధికారి వేకటేశ్వర్లు ,డి ఎం సి యస్ నా గేశ్వర్రావు తహసిల్దార్ పల్నాటి శ్రీనివాస్ రెడ్డిరెవిన్యూ ఇన్స్పెక్టర్ సివిల్ సప్లై లింగస్వామి,ఏ పీపీం వోగోటి కష్ణ, సీసీ రమాదేవి, వీఓఏలు సుమలత, విజయ, శివశంకర్ పాల్గొన్నారు.