Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి
అ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి చిన్నపాక లక్ష్మీనారాయణ
నవతెలంగాణ -నల్లగొండ
భవన నిర్మాణ రంగ కార్మికుల చట్టాలను పునరుద్ధరించాలని బిల్లిండ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్రకార్యదర్శి చిన్నపాక లక్ష్మినారాయణ డిమాండ్చేశారు. గురువారం స్థానిక దొడ్డికొమరయ్య భవనంలో తాళ్లపల్లి ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. 1996 కేంద్ర చట్టం,1979 వలస కార్మికుల చట్టాల రక్షణ, నిర్మాణ రంగంలో వాడే ముడిసరుకుల ధరలు తగ్గించాలని,ఇతర పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్2, 3 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కరోనా కాలంలో పనులు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న నిర్మాణ రంగ కార్మికులకు సిమెంటు ఇసుక ధరలు పెరగడం మూలంగా మరింత ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారిని ఆదుకోవడం కోసం వెల్ఫేర్ బోర్డ్ నిధుల నుండి పదివేల ఆర్థిక సహకారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి అద్దంకి నరసింహ, బోల్లెద్దు సైదులు, జిల్లా నాయకులు పసుల ఇన్నయ్య, మొగుదాల వెంకటేశం, డి వెంకట్ రెడ్డి, సాగర్ల మల్లయ్య, బి గురువయ్య, శంకర్, జె సత్యనారాయణ, రాము, చరణ్, బి సైదులు, డి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.