Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిటౌన్
ఈ నెల 27, 28 తేదీల్లో పట్టణంలోని ఎస్ఎల్ఎన్ఎస్ కన్వెన్షన్ హాల్లో జరగనున్న జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాలుగవ మహాసభలు జయప్రదం కోసం ఏర్పాటు చేసిన ఆహ్వాన సంఘం బ్రొచర్‌ను గురువారం భువనగిరి డీసీపీ నారాయణ రెడ్డి ఆవిష్కరించారు. ఆహ్వాన సంఘం చీఫ్ ప్యాట్రన్‌గా భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి, గౌరవ అధ్యక్షుడిగా డాక్టర్ సి హెచ్. మోహన్ రావు (సీసీఎంబీ పూర్వ సంచాలకులు), డాక్టర్ మెహతాబ్ ఎస్.బాంజీ (పూర్వ ఉపసంచాలకులుఎన్ఐఎన్), రిటైర్ ఐఏఎస్ ఎం.మనోహర్ ప్రసాద్ ,జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు అందె సత్యం, ముద్ర దినపత్రిక సంపాదకులు ఎలిమినేటి ఇంద్రారెడ్డి ,సహ అధ్యక్షులు ఎన్ భాస్కరాచారి, జిల్లా జేవివి ఉపాధ్యక్షులు,సలహా దారులుగా భువనగిరి మున్సిపల్ చైర్మెన్ ఏ. ఆంజనేయులు , పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర సీనియర్ నాయకులు మహాసభల కోశాధికారి శాంతి కుమార్, జే వి వి సంఘం గౌరవాధ్యక్షులు డి. బాలాజీ,ఆహ్వాన సంఘం అధ్యక్షులు ఎలిమినేటి ఇంద్రా రెడ్డి , జిల్లా నాయకులు జె.దనాప్ రెడ్డి పాల్గొన్నారు.