Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన కేసీిఆర్ ప్రభుత్వానికి గుణపాఠం చెబుదాం
అ ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ కుడుదుల నగేష్
నవతెలంగాణ - భువనగిరి
రాష్ట్రంలో కళకళలాడాల్సిన స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన స్థానిక ప్రజా ప్రతినిధులు అయిన కౌన్సిలర్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ లకు కనీస విలువ లేకుండా చేసిన కెేసీిఆర్ టీిఆర్ఎస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గొంతుకనై ప్రశ్నించి తగిన గుణపాఠం చెబుతానని ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి ,మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కుడుదుల నగేష్ అన్నారు. గురువారం పట్టణకేంద్రంలోని దీప్తి హోటల్ నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల ఆకాంక్షలతో ఏర్పాటుచేసిన తెలంగాణలో ఏ ఒక్కటి ప్రజలకు అందలేదన్నారు. అదే క్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు అయిన కౌన్సిలర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలకు కనీస మర్యాద, గౌరవం లేకుండా పోయిందన్నారు. ఎన్నో కష్టాలు, నష్టాలకు, బాధలకు ఓర్చి ఎన్నికల్లో గెలిచిన తర్వాత కనీసం లక్ష రూపాయల అభివద్ధి పని చేయకుండా దౌర్భాగ్య స్థితిలో స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారని తెలిపారు. 73 వ రాజ్యాంగ సవరణ ద్వారా సంక్రమించిన హక్కులు, అధికారాలను కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారన్నారు. గాంధీజీ కన్న గ్రామ స్వరాజ్య కలలను కెేసీఆర్ పూర్తిగా నీరుగార్చారని తెలిపారు. 14, 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధులను దారి మళ్లించి స్థానిక ప్రజా ప్రతినిధులను దిక్కులేనివారిగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నిటికీ తగిన గుణపాఠం చెప్పి స్థానిక ప్రజాప్రతినిధుల ఆత్మగౌరవ చిహ్నంగా ప్రశ్నించే గొంతుక గా పోటీ చేస్తున్న తనకు పార్టీలకతీతంగా అందరూ ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం, జిల్లా ఎంపీపీల సంఘం అధ్యక్షులు, వలిగొండ ఎంపీపీ నూతి రమేష్, ఆలేరు ఎంపీపీ గంధమల్ల అశోక్, మోత్కూరు ఎంపీపీ దీటి సంధ్య, ఎం.పి.టి.సి ల సంఘం జిల్లా అధ్యక్షురాలు గునుగుంట్ల కల్పన శ్రీనివాస్,భువనగిరి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్ కుమార్, చౌటుప్పల్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తిని సైదులు, భువనగిరి మున్సిపల్ మాజీ చైర్మెన్ బర్రె జహంగీర్, పడిగెల ప్రదీప్, దర్గాయి హరి ప్రసాద్, మంగ ప్రవీణ్, ఎనగండ్ల సుధాకర్, ఎండి. గౌస్, పల్లె సంతోష్, కోళ్ల గంగాధర్, పాల్గొన్నారు.