Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ తడిసి రంగుమారిన ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయాలి
అ సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి
నవతెలంగాణ -నల్లగొండ
నీటి మడుగులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో తడిసి రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . గురువారం కనగల్ మండలం జి.ఎడవెల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. సొసైటీ వారు నీటి మడుగులో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం సరి కాదన్నారు వర్షాలకు ధాన్యం నీటిలో తేలే ఆడుతోందన్నారు. ప్రభుత్వం రైతులను పట్టించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రం లో పై నుండి కాలువ ద్వారా కిందికి దాన్యం రాశుల్లోకి నీరు చేరి ధాన్యం తడుస్తోందన్నారు. అధికారులు ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధి లేక నీరు నిలిచే ప్రదేశంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారని విమర్శించారు.వాతావరణం కారణంగా 17 శాతం తేమ వచ్చినప్పటికీ మరుసటి రోజు 24 చేరుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తేమశాతంతో సంబంధం లేకుండా పూర్తిగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, వచ్చే యాసంగి అయినా కొనుగోలు కేంద్రాన్ని మార్చి ఎత్తు ఉన్న ప్రదేశంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం)జిల్లా కమిటీ సభ్యులు దండంపల్లి సత్తయ్య ,మల్లం మహేష్ ,మండల సహాయ కార్యదర్శి లింగస్వామి, ఎం డి అక్రమ్, పోలె సత్యనారాయణ, మాదాసు రావణ్ రైతులు సైదులు కోటమ్మ సత్తయ్య మారెమ్మ పుల్లమ్మ తళ్లారి చంద్రయ్య కార్డింగ్ వెంకటమ్మ జోగు శంకరయ్య కానుగు కర్రయ్య తదితరులు పాల్గొన్నారు