Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెద్దవూర
మండలంలోని పులిచర్ల గ్రామంలో గురువారం జిల్లా సాంఘిక సంక్షేమఅధికారి ఉడుతనూరి వెంకటయ్య గిరిజన వసతిగహాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా వసతిగహంలో ఉన్న గదులు,పరిసరాలను పరిశీలించారు.వసతి గహంలో పిచ్చిమొక్కలు ఉన్నాయని,విద్యార్థులకు సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వెంటనే తీసివేయించాలని వార్డెన్‌ను ఆదేశించారు.అనంతరం విద్యార్థులతో సమావేశమై సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.మెనూ ప్రకారం భోజన ఇస్తున్నది..లేనిది ఆరా తీశారు. మెనూ ప్రకారం భోజనం, గుడ్లు, అరటిపళ్లు, స్నాక్స్ ఇస్తున్నారని విద్యార్థులు వివరించారు.నోట్‌బుక్స్,బెడ్‌షీట్ ఇస్తున్నారా..లేదా ? అనే విషయం ఆరా తీశారు.86 మంది విద్యార్థులకు గాను 43 విద్యార్థులు హాజరయ్యారన్నారు.విద్యార్థుల సంఖ్యను పెంచుకోవాలని,18 నెలల తరువాత పాఠశాలలు, వసతిగహాలు తెరుచుకున్నాయని, వసతి గహపరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత వార్డెన్లపై ఉందన్నారు.ఆయన వెంట ఏపీఎంఓ డీపీనాయక్, ఇన్చార్జి వార్డెన్ శ్రీనివావాసులు తదితరులు ఉన్నారు.