Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెన్‌పహాడ్
ధాన్యం కొనుగోలుకేంద్రాల్లో తేమచూసే విధానంలో జరుగుతున్న అక్రమాలను నిరసిస్తూ గురువారం మండలంలోని మాచారం గ్రామ రైతులు ఆర్అండ్బీ రోడ్డుపై ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలోని ఐకేపీ సెంటర్లో తేమ చూసే మిషన్‌లో రెండో నెంబర్ నొక్కడంతో 25 నుండి 30 తేమశాతం చూపిస్తుందన్నారు.మాచారం నుండి అదే రాశిలోని ధాన్యం గరిడేపల్లి మండలం గడ్డిపల్లి ఐకేపీ కేంద్రంలో తేమను చూపించగా 16 చూపించిందని, చూసే విధానంలో రెండు ఐకేపీ కేంద్రాలలో రెండు విధాలుగా ఉండడం వలన తేమశాతం మాచారంలో ఎక్కువగా చూపిస్తుందని ఆరోపించారు.గడ్డిపల్లి గ్రామములో ఐకేపీ కేంద్రంలో తేమ చూసే సమయంలో ఒకటో నెంబర్ నొక్కడం, మాచారం ఐకేపీ కేంద్రంలో తేమ మిషన్‌లో రెండో నెంబరు నొక్కడం ద్వారా తేడా వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.విషయం తెలుసుకున్న ఎస్సై శ్రీకాంత్‌గౌడ్ సీఈఓ సోమ్లానాయక్‌ను పిలిపించి రైతులకు పరిష్కారం చూపిస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.