Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేవరకొండ :కరోనా వైరస్ నిర్మూలన కోసం పాటలు పాడి ప్రజల్లో చైతన్యం పురికొల్పినందుకు గాను బీహ్యాండ్ లైఫ్ ఫౌండేషన్ సంస్థ వారు హౌప్ హ్యూమానిటీ అవార్డును పల్లె నర్సింహాకు ప్రదానం చేసింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంతో పాటు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ సమాజంలోని సకల వర్గాలను ఉత్తేజితులను చేసినందుకు గాను ఆయన ఈ అవార్డు అందుకున్నారు.బుధవారం రవీంద్రభారతిలో బీహ్యాండ్ లైఫ్ ఫౌండేషన్ సంస్థ ఏర్పాటు చేసిన సమావేశంలో వివిధ వర్గాలకు అవార్డు ప్రధాన కార్యక్రమంలో భాగంగా సాంస్కతిక, భాషాశాఖ డైరెక్టర్ మామిడి హరికష్ణ, ఫౌండేషన్ అధ్యక్షులు ఇరిగి నర్సింగ్‌రావు చేతుల మీదుగా నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం పడమటపల్లి గ్రామానికి చెందిన తెలంగాణ ప్రజా నాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహా అవార్డు స్వీకరించారు. అవార్డు దక్కడం సంతో షంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అవార్డు అందుకున్న పల్లె నర్సింహాకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లె నర్సింహారెడ్డి, ప్రజానాట్యమండలి సీనియర్ ఉపాధ్యక్షులు కె.లక్ష్మినారాయణ, స్థానిక సర్పంచ్ కిన్నెర యాదయ్య, జిల్లా కార్యదర్శి నెర్లకంటి సత్యం, పలువురు కళాకారులు, రచయితలు, కవులు, కళాభిమానులు అభినందించారు.