Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దామరచర్ల :జాతీయస్థాయి రగ్బీ పోటీలకు మండలకేంద్రానికి చెందిన విద్యార్థి అనిపిరెడ్డి వినోద్‌రెడ్డి ఎంపికయ్యారు.మిర్యాలగూడలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వినోద్‌రెడ్డి గత అక్టోబరు 10 నుంచి మూడు రోజులపాటు మెదక్ జిల్లా చేగుంటలో జరిగిన తెలంగాణ సీనియర్ రగ్బీ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబర్చి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.ఈనెల 16 నుంచి మూడు రోజులపాటు ఒరిస్సాలోని భువనేశ్వర్ లో జరుగనున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించాడు. వినోద్ రెడ్డి ఎంపిక పట్ల క్రీడాకారులకు సహాయ సహకారాలు అందిస్తున్న జీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మెన్ గడ్డంపల్లి రవీందర్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.