Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేవరకొండ:మండలంలోని పడమటిపల్లి పాఠశాల స్కూల్ అసిస్టెంట్ తెలుగు, దేవరకొండ బాలికల పాఠశాలలో ఉన్నఇంగ్లీష్ టీచర్లను అక్రమంగా డిప్యుటేషన్లు వేసిన డీఈవోను సస్పెండ్ చేయాలని, డిప్యుటేషన్లు రద్దు చేయాలని యూఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఎంఈఓకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వంగూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పడ మటిపల్లి పాఠశాలలో దాదాపు 320 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. ఈ పాఠశాలలో తెలుగు టీచర్ ఉండేవారు కానీ విద్యాశాఖ అధికారుల వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాల కోసం తెలుగు టీచర్ను దేవరకొండ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్ను వేరే ప్రాంతంకి పంపించారని, దాదాపు ఈ పాఠశాలలో 800 విద్యార్థులు ఉన్నారన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో డివిజన్ కార్యదర్శి సయ్యద్ ఫయాజ్, గుండాల నాగరాజు, సుభాన్ ఉన్నారు.