Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దామరచర్ల
మండలకేంద్రంలోని సబ్మార్కెట్యార్డును కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కేతావత్ శంకర్‌నాయక్ బుధవారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయకుండా ధర్నాలు చేసుకుంటూ డ్రామాలు చేసూప్త రైతులను మోసం చేస్తున్నారన్నారు.ధాన్యం పండించి రెండు నెలలైనా ఇంతవరకు కొనుగోలుకేంద్రాలను తెరవకుండా రైతులను నట్టేటా ముంచిన ఈ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదని తెలిపారు. అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని తేమశాతంతో సంబంధం లేకుండా మద్దతుధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.కొనుగోలుకేంద్రాలలో గోనెసంచులు టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచి రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాజుల శ్రీనివాస్, కిసాన్‌సెల్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి, సర్పంచ్ బంటుకిరణ్, సిద్ధునాయక్, కొర్రనాగునాయక్, అడోతునాగు, సదానందం, గోపాల్, ఖాదర్, మోహన్‌రెడ్డి, సుభాని, సద్దాం, శివ, కోటి,శ్రీనివాస్ పంతులు, కిషన్, ఖాశీం, బత్తినివెంకటేశ్వర్లు, ఓర్సు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.