Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విగ్రహావిష్కరణలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
హాజరైన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు
నవతెలంగాణ-నిడమనూరు
ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేసి ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తులు ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రామూర్తి యాదవ్ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదేశ్వర్‌రెడ్డి అన్నారు.బుధవారం మండలపరిధిలోని వేంపాడు వద్ద ఏర్పాటు చేసిన స్మృతివనంలో నోముల, రామ్మూర్తియాదవ్ కాంస్య విగ్రహాలను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. చలకుర్తి శాసనసభలో రామ్మూర్తి యాదవ్, నాగార్జున సాగర్ నుండి ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ప్రాతినిధ్యం వహించి ఈ ప్రాంత అభివద్ధికి నిరంతరం కషి చేశారని పేర్కొన్నారు.అనేక పర్యాయాలు ఎమ్మెల్యే గా మంత్రిగా పని చేసిన జానారెడ్డి నియోజకవర్గ అభివద్ధిని ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య గెలిచిన రెండేండ్లలో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు పరిచి అనునిత్యం ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారని పేర్కొన్నారు.కమ్యూనిస్టు పార్టీలో ఆయన ఎమ్మెల్యే గా గెలుపొందిన ఆయన ప్రతిపక్ష హోదాలోనే అనేక సమస్యలను అసెంబ్లీ దష్టికి తీసుకొచ్చి ప్రజల పక్షాన పోరాడిన మహా నాయకుడని అలాంటి వ్యక్తి దూరమైన ఆయన ఆశయాలు ఎప్పటికి నిలిచి పోతాయని తెలిపారు. ప్రతి ఒక్కరితో స్నేహపూర్వక వాతావరణంలో కలిసి మెలిగేనాయకుడు నోముల నర్సింహయ్య అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంటు సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్యే నోముల భగత్ మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు,నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్‌రెడ్డి, హుజూర్నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్,నాయకులు కడారి అంజయ్యయాదవ్, జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇస్లావత్ రాంచంద్రయ్యనాయక్, ఎంపీపీ బొల్లం జయమ్మ, డీసీసీబీ డైరెక్టర్ విరిగినేని అంజయ్య, సర్పంచ్ ఆరవ స్వాతిఅశోక్, మార్కెట్ కమిటీ చైర్మన్ కామర్ల జానయ్య, రాష్ట్ర నాయకులు మన్నెం రంజిత్‌యాదవ్, కట్టెబోయిన గుర్వయ్య యాదవ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు పోలె డేవిడ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు పెడమంయాదయ్య,టీఆర్ఎస్ మండల అధ్యక్షు కార్యదర్శులు తాటి సత్యపాల్, నల్లబోతు వెంక టేశ్వర్లు,మాజీ మండలఅధ్యక్షుడు నూకలవెంకటరెడ్డి పాల్గొన్నారు.