Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాజీ ఎమ్మెల్యే జూలకంటిరంగారెడ్డి
నవతెలంగాణ-మునగాల
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో చెలగాటమాడడం మానుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి హెచ్చరించారు.బుధవారం కొక్కిరేణి గ్రామంలో పార్టీ మండల 8వమహాసభను నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ పాలకుల విధానాలతో రైతాంగం నష్టాల పాలౌతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు వరి సాగు విషయంలో రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనలు రైతుల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరిపైమరొకరు ఆరోపణలు చేసుకంటూ ధాన్యం సేకరణ నుంచి తప్పించుకుంటున్నాయని మండి పడ్డారు. రైతుపోరాటాలతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి మూడు వ్యవసాయచట్టాలను రద్దు చేసిందని గుర్తుచేశారు. చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి మతి చెందిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు.విద్యు త్ సంస్కరణలబిల్లుతో పాటు కార్మికవ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. సామ్రాజ్యవాదుల చేతిలో మోదీ ప్రభుత్వం కీలుబొమ్మగా మారిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను వేసవి మెట్ట పంటలను సాగు చేసుకోమనడం సరికాదన్నారు.మాగాణి భూములు మెట్ట పంటలసాగుకు అనుకూలంగా వుండవని గుర్తుచేశారు.వేసవిలో వరి పంటలు సాగు చేయకపోతే రైతులు నష్టాల పాలౌతారని చెప్పారు. వరిపంట సాగుకు అవకాశామిచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని తెలిపారు. పంటలసాగుపై అఖిలపక్ష పార్టీలతో చర్చించి రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.లేని ఎడల కేంద్ర రాష్ట్ర ప్ర భుత్వాలకు రైతులు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు .పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, కుంభజడ వెంకట కోటమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు ములకలపల్లి రాములు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బుర్రి శ్రీరాములు, కొలిశెట్టి యాదగిరిరావు, రవినాయక్, మండలకార్యదర్శి దేవరం వెంకట్రెడ్డి, సీనియర్ నాయకులు పోటు పుల్లయ్య, నందిగామ సైదులు పాల్గొన్నారు.