Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ ఆర్ఎస్. ప్రవీణ్‌కుమార్
నవతెలంగాణ- చిట్యాల
పేద రైతుల పొట్ట కొట్టే ఇండిస్టియల్ పార్క్ ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని వెలిమినేడు, పిట్టంపల్లి గ్రామ రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూముల్లో ప్రభుత్వం ఇండిస్టీయల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం అన్యాయమన్నారు. కేవలం బడా పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసం రెక్కాడితే గాని డొక్కాడని 400 మంది పేద రైతుల భూములు గుంజుకోవడం హేయమైన చర్యగా అభివర్ణించారు. చదువుకున్న వారికి నోటిఫికేషన్లు ఇవ్వక ఉద్యోగాలు రాక ఉన్న భూమిలో వ్యవసాయాన్ని నమ్ముకొని ఉన్నారు, అలాంటి వారి భూములు లాక్కోవడం సిగ్గుచేటన్నారు. స్థానిక ఎమ్మార్వో పంట పొలాలు లేవు అని పాడి భూములను అని ప్రభుత్వానికి రిపోర్ట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఇండిస్టియల్ పార్క్ ఏర్పాటు చేసుకోవాలంటే కోకాపేట శామీర్‌పేట లో , మంత్రుల, ఎమ్మెల్యేల ఫామ్ హౌస్ ఉన్నాయన్నారు. వాటిలో ఏర్పాటు చేసుకోవచ్చని అని అన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ తమకున్న వ్యవసాయ భూమిలో వరి,పత్తి పండుతుందని అదే ఆధారంగా జీవిస్తున్నామని, భూమిని కోల్పోతే తమకు చావే దిక్కని పలువురు రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రియదర్శిని మేడి, బీఎస్పీ -పూలే బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోలి నర్సింహ,మహిళ ఇంచార్జి ఎలిజబెత్,మర్రి శోభ, మండల కో కన్వీనర్,కవిత అంశల సత్యనారాయణ, పి వెంకటాచారి,ఎలుక రాజు మల్లేశం, నేతి మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.
కట్టంగూర్ : బహుజన సమాజ్ పార్టీ తోనే బహుజనుల జీవితాల్లో మార్పు వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బుధవారం మండలంలో ఆయన పర్యటించారు. మండల కేంద్రంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఐటి పాముల గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి ఊటుకూరి సతీష్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏండ్ల తరబడి వివిధ పార్టీలకు ఓటు వేసినా బహుజనుల జీవితాల్లో మార్పు రాలేదని బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తేనే మార్పు సాధ్యమవుతుందన్నారు.కార్యక్రమంలో బిఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జిచార్జ్ మేడి ప్రియదర్శని, కత్తుల కాన్షీరాం, నాయకులు మేడి శ్రీనివాస్, పిల్లి మహేష్,ఉట్కూరి వెంకట్ , మేడి భారత్ ,శివ,వెంకటాచారి,రవి, రాంబాబులు ఉన్నారు.
నకిరేకల్ : ఇండిస్టియల్ పార్కు పేరుతో రైతుల భూములను బలవంతంగా గుంజు కుంటే ఊరుకోబోమని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. బుధవారం నకిరేకల్‌కు వచ్చిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో ఇండిస్టియల్ పార్కు ఏర్పాటు కోసం 500 రైతుల ఆధీనంలో ఉన్న భూములను బలవంతంగా గుంజు కోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సేద్యం చేసుకుంటూ భూముల పై ఆధారపడి జీవనం సాగిస్తున్న పేద రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని మండిపడ్డారు. 24 గంటల కరెంటు అందజేసి వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలంటే ఎలా అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల వారు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో రోజులతరబడి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా తాత్సారం చేయడం మూలంగా రైతులు కేంద్రాల్లోనే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట నకరేకల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్జి ప్రియదర్శిని, నాయకులు ఉన్నారు.