Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ -నల్లగొండ
దేశంలో మత ప్రాతిపదికన రాజకీయాలు చేస్తున్న బీజేపీ విధానాలను మానుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి హెచ్చరించారు. ఆ పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఫ్‌ుపరివార్ మతం పేరుతో రాజకీయాలు చేసి అధికారం సాధించడానికి, మత విద్వేషాలను రెచ్చగొట్టి మతకలహాలు సష్టిస్తోందన్నారు. ముస్లిం మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌లో ముస్లిం రిక్షా కార్మికులని జైశ్రీరామ్ అని అనాలని బజరంగదళ్ కార్యకర్తలు తన మైనర్ కూతురు ముందే తీవ్రంగా కొట్టారన్నారు. మధ్యప్రదేశ్‌లో త్రిపురలో మసీదుల పై, చర్చీలపై దాడులు చేస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. పౌరులందరూ తమకు నచ్చిన మతాన్ని అవలంబించడానికి తమకు నచ్చిన ఈ విధంగా ప్రార్ధన చేసుకునే హక్కు రాజ్యాంగం కల్పించిందన్నారు. ప్రజలంతా కలిసి మెలిసి జీవించాలని రాజ్యాంగం చెపుతుంటే మత ప్రాతిపదికన విభజించాలనే కుట్ర బీజేపీ చేస్తుందని విమర్శించారు. ఈ ర్యాలీ దొడ్డి కొమరయ్య భవనం నుండి ప్రారంభమై మైసయ్య సర్కిల్, ప్రకాశం బజార్, భాస్కర్ టాకీస్, గడియారం సెంటర్, సుభాష్ విగ్రహం, వరకు కొనసాగింది. ఈ నిరసన ర్యాలీలో ఆ పార్టీ జిల్లా పట్టణ నాయకులు సయ్యద్ హాశమ్, ఎండి సలీం, దండం పల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, చిన్న పాక లక్ష్మీనారాయణ, కుంభం కష్ణారెడ్డి, మౌలానా నిజాముద్దీన్, ఎస్కే మహబూబ్ అలీ ,భూతం అరుణ, ఎగ్ బాల్ సాజిద్, అద్దంకి నరసింహ, పోలే సత్యనారాయణ ,మధుసూదన్ రెడ్డి, మహమ్మద్ ఆరిఫ్, జక్కల రవికుమార్, రెహానా బేగం, కే ఉమారాణి ,గాదే నరసింహ, ఫాతిమా బేగం, గుండాల నరేష్, చంటి పర్వేద సైదాచారి ఏం సుందరయ్య శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు.