Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నకిరేకల్
రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని పీఏసీఎస్ చైర్మెన్ పల్ రెడ్డి మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం పట్టణ శివారులోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చీమల గడ్డ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి రైతులతో మాట్లాడారు. మండల వ్యాప్తంగా ఏర్పాటు చేసిన నాలుగు కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు లక్షా 25 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు చెప్పారు.గోరింకల పల్లి కొనుగోలు కేంద్రం లోని రైతులకు రూ. 2 కోట్లు పంపిణీ చేశామని, ఈనెల 4,5 తేదీలలో చీమల గడ్డ కొనుగోలు కేంద్రం రైతులకు వారి ఖాతాలలో ధాన్యం డబ్బులు జమ అవుతాయని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సహకారంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. ఆయన వెంట కేంద్ర నిర్వహణ ఇన్చార్జి నాగరాజు, రైతులు ఉన్నారు.