Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బీబీనగర్
కార్మికులు, అంతర్ రాష్ట్ర వలస కార్మికుల రక్షణ చట్టాలను పునరుద్దరించాలని, భవన నిర్మాణ మెటీరియల్ ధరలు వెంటనే తగ్గించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ కమిటీ పిలుపుమేరకు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గురువారం మండలకేంద్రంలో నిరసన తెలిపారు. అనంతరం తహశీల్దార్ వెంకట్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. శుక్రవార జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రద్దుచేసిన 1996 కేంద్ర చట్టం, 1998 సెస్ చట్టం, 1979 అంతర్ రాష్ట్ర వలస కార్మికుల రక్షణ చట్టాలను వెంటనే పునరుద్దరణ చేయాలని డిమాండ్‌చేశారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల నాయకులు గాడి శ్రీనివాస్, ఎల్లాంల సత్యనారాయణ, రమేశ్, మహిపాల్‌రెడ్డి, బాలరాజు, భాస్కర్, అనిల్ పాల్గొన్నారు.