Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
నేటి సమాజంలో యువకులు బాగా చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా స్వయం ఉపాధి ఏర్పాటుచేసుకోవాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రమణగోని శంకర్ తెలిపారు. గురువారం మున్సిపల్ కేంద్రంలో నూతనంగా ఏర్పాటుచేసిన రెడ్డి చికెన్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత స్వయం ఉపాధి ఏర్పాటుచేసుకొని మరో నలుగురికి ఉపాధి కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో 3వ వార్డు కౌన్సిలర్ బండమీది మల్లేశం, నాయకులు రిక్కల సుధాకర్‌రెడ్డి, దాసోజు బిక్షమాచారి, బుడ్డ సురేశ్, బాతరాజు లింగస్వామి, తొర్పునూరి యాదయ్యగౌడ్, యజమానులు సప్పిడి తిరుమల్‌రెడ్డి, ఎర్రబెల్లి రమేశ్ పాల్గొన్నారు.