Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నల్లగొండ
బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జిల్లా కేంద్రంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా పనిచేస్తున్న భీమగాని రణదివె నియమితులయ్యారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గురువారం ఆయనకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రణదివే మాట్లాడుతూ బీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం, ఉద్యోగుల సంఘం బలోపేతం కోసం శక్తివంచన లేకుండా కషి చేస్తానన్నారు. బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని దశాబ్ద కాలంగా ఉద్యమిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ఉద్యోగులకు ఇబ్బందికరంగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని ఎత్తివేసి పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాపోలు రమేష్ ,మిరియాల గూడ ట్రెజరీ అధికారి చంద్రశేఖర్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు మహేష్, రాజు, కిరణ్ ,తదితరులు పాల్గొన్నారు.