Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ఆలేరుటౌన్
ఆలేరు నియోజకవర్గంలోని పాడి రైతుల సమస్యల పరిష్కారం కోసం ,ప్రోత్సాహకం రూ.4 వారికి అందేలా ప్రభుత్వం మెడలు వంచేందుకు ఆమరణ నిరాహార దీక్షకు సైతం తాను సిద్ధమని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య అన్నారు .గురువారం పాడి రైతులకు ప్రభుత్వం వెంటనే ప్రోత్సాహకం 4 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించేందుకు పాడి రైతులతో కలిసి తరలి వెళ్లారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతులు పాడి పశువులకు ఇన్సూరెన్స్ కట్టించుకున్నప్పటికీ ప్రమాదబీమా ప్రభుత్వం రెెండేండ్ల నుండి చెల్లించడం లేదన్నారు.రైతుల సొమ్ము తిన్న ఏ ప్రభుత్వం సుదీర్ఘ కాలంగా పనిచేసింది లేదన్నారు. పాడి రైతులతో కలిసి మదర్ డెయిరీకి కాపాడుకుంటామనానరు. రాయితీల సొమ్ము తిన్న దొంగలను గుర్తించి మదర్ డెయిరీ చైర్మెన్్ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల పాడి రైతులు పాల్గొన్నారు.