Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ డీసీసీ అధ్యక్షులు
కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణ -భువనగిరిరూరల్
మొలకెత్తిన, రంగుమారిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని కాంగ్రెస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని తుక్కాపురం గ్రామంలోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసి రెండు నెలలుగా రైతులు ఎదురుచూస్తున్నారన్నారు. పట్టాలకు కిరాయి చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. తరుగు పేరుతో బస్తాకు నాలుగు కిలోలు అదనంగా వేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కోట పెద్ద స్వామి, మండల నాయకులు బింగి బిక్షపతి, ఆదినారాయణ, పాక వెంకటేష్ యాదవ్, రత్న పురం శ్రీనివాస్ గ్రామ శాఖ అధ్యక్షులు జనగాం సత్యనారాయణ, మహేష్, ఎడ్ల శ్రీనివాస్, ఎల్లకొండ ప్రవీణ్ రెడ్డి, ఎలాముల జంగయ్య యాదవ్ పాల్గొన్నారు.