Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను తిప్పి కోట్టేందుకు సమరశీల పోరాటం చేయాలని సీపీిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి అన్నారు. గురువారం యాదగిరిగుట్టలో ఆ పార్టీ నల్లగొండ ,సూర్యాపేట ,యాదాద్రి భువనగిరి జిల్లా సమితి సభ్యులు రాజకీయ శిక్షణా తరగతులు లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్లో జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సభలో ఆయన మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ ఎజెండానే తమ ఏజెండాగా బీజేపీ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుందని అన్నారు. అందువల్లే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసిందన్నారు. కులాల మధ్య ,మతాల మధ్య చిచ్చు పెడుతూ అధికారం పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహారెడ్డి,నల్లగొండ ,సూర్యాపేట జిల్లా కార్యదర్శులు నెలికంటి సత్యం,బెజవాడ వెంకటేశ్వర్లు ,యాదాద్రి జిల్లా సహాయ కార్యదర్శులు యానాల దామోదర్ రెడ్డి ,బోలాగానిసత్యనారాయణ ,జిల్లా కార్యవర్గ సభ్యులు కొల్లూరు రాజయ్య ,బండి జంగమ్మ, ఏఐటీయూసీి జిల్లా అధ్యక్షులు గోరేటి రాములు, ఆ పార్టీ మండల కార్యదర్శి బబ్బురి శ్రీధర్,ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ పేర బోయిన మహేందర్, మండల సహాయ కార్యదర్శి కల్లేపల్లి మహేందర్,మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు పెరబోయిన పెంటయ్య పాల్గొన్నారు.