Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ను డీసీపీ కె. నారాయణరెడ్డి తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ నిర్వహణ, స్టేషన్లో పరిశుభ్రత, సిబ్బంది పనితీరును పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశారు. రికార్డుల నిర్వహణ తీరును పరిశీలించి అభినందించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కు వచ్చిన వారితో స్నేహపూర్వకంగా ఉండాలని సూచించారు. ప్రజలతో మమేకమై, పోలీసు వ్యవస్థపై గౌరవ ఏర్పడేలా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకటరెడ్డి, రూరల్ సీఐ జానయ్య, రూరల్ ఎస్ఐ సైదులు, సిబ్బంది పాల్గొన్నారు.