Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత
నవతెలంగాణ -ఆలేరుటౌన్
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైతులకు ప్రత్యామ్నాయ పంటల పై అవగాహన కల్పించి , ప్రోత్సాహకాలు అందించాలని ఆలేరు శాసన సభ్యురాలు, రాష్ట్ర ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. గురువారం నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వ్యవసాయం ప్రధాన వత్తిగా చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రైతులు పెరుగుతున్న ధరలతో పంట దిగుబడి వచ్చినప్పటికీ గిట్టుబాటు ధరల్లేక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. చనిపోయిన రైతుల వివరాలు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి దగ్గర లేకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు పండించిన పంటను ప్రతి గింజ కొనుగోలు చేస్తదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాల్లో రైతు సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామని ,అన్ని పంటలను ప్రోత్సహిస్తూ, ప్రోత్సాహకాలు అందిస్తూ మద్దతు ధర అందిస్తామని తీర్మానించాలని డిమాండ్ చేశారు.బీజేపీ అధ్యక్షులు బండి సంజరు కేంద్రం మెడలు వంచి ధాన్యం కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు .నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ పసుపు రైతులకు పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని ఎన్నికలప్పుడు అక్కడి ప్రజలకు బాండ్ సైతం రాసిచ్చాడని,ఎన్నికల అనంతరం గెలిచాక రైతులను మోసం చేశాడని చెప్పారు .ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్ల కారణంగా కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమే అన్నారు. .అకాల వర్షాలకు రైతులు ధాన్యం తడవకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయాల డైరక్టర్ ఆడెపు బాలస్వామి , మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ గదపాక నాగరాజు, టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు గంగుల శ్రీనివాస్, పుట్టా మల్లేశం, ఎంపీటీసీ జూకంటి అనురాధ అనిల్ ,వార్డు కౌన్సిలర్ బేతి రాములు, నాయకులు కోటగిరి ఆంజనేయులు, బింగి రవి, మొర్తాల రమణారెడ్డి ,ఆయిలి క్రిష్ణ ,అంజన్ కుమార్,పూల శ్రావణ్ ,గఫూర్, గంధమల్ల యాదగిరి, బబ్లూ పాల్గొన్నారు.