Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి
నవతెలంగాణ- భువనగిరిరూరల్
విత్తన, ఎరువుల డీలర్లు తమ షాపులలో అన్ని రకాల రిజిస్ట్రర్లను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. గురువారం మండలంలోని ముత్తిరెడ్డిగూడెంలోని రైతు వేదిక భవనంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా లోని విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల డీలర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆయన మాట్లాడుతూ ప్రతి డీలర్ తప్పకుండా తమ షాపులో కనిపించే విధంగా లైసెన్స్ ప్రదర్శించాలన్నారు. స్టాక్ బోర్డు పెట్టాలన్నారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే విధంగా వారిని ప్రోత్సహిస్తూ విత్తనాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారి కె.అనురాధ, సహాయ సంచాలకులు డి. వెంకటేశ్వరరావు, డి.పద్మావతి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులకు సంబంధిం చిన చట్టాలను వాటిని అమలు పరిచే విధానాలను, ఈపాస్ మిషన్లో ఎరువుల నమోదు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికార్లు, డీలర్లు పాల్గొన్నారు.