Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
పోచంపల్లి పట్టణ కేంద్రంలో ఈ నెల 5 6 7 తేదీలలో జరగనున్న సీపీిఐ(ఎం) జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ గురువారం మండల కేంద్రంలో బైకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దోనూరి నర్సిరెడ్డి ప్రారంభించి మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి పోరాటంలో సీపీిఐ (ఎం) ముందుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు విజరు శ్రీనివాసాచారి సీనియర్ నాయకులు శ్రీనివాసరెడ్డి, మండల కార్యదర్శి దొడ యాదిరెడ్డి, తుమ్మల నర్సిరెడ్డి చింతకాయల నరసింహ, బద్దుల వెంకటేశం పిట్ట రాములు, శివశక్తి లాలయ్య, నరసింహ ,రాచకొండ కష్ణ, తదితరులు పాల్గొన్నారు.
ఆలేరుటౌన్ : ఈ నెల 5,6,7 తేదీల్లో నిర్వహించే సీపీఐ(ఎం) జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ గురువారం మండల కేంద్రంలో ఆ పార్టీ మండల, పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మంగ నర్సింహులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారన్నారు. దేశవ్యాప్తంగా స్వామినాథన్ కమిటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసి, రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలన్నారు. ఎరువులు విత్తనాలు ఉచితంగా అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి దుపటి వెంకటేష్ ,పిక్క గణేష్, గ్యార భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.