Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు ఎం.రాజశేఖర్‌రెడ్డి. జి.నాగమణి
నవతెలంగాణ -నకిరేకల్
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ఆ సంఖ్యకు అనుగుణంగా విద్యావలంటీర్లను, ఉపాధ్యాయులను నియమించాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు ఎం.రాజశేఖర్ రెడ్డి, జి.నాగమణి కోరారు. గురువారం పట్టణంలోని ఆ సంఘం ప్రాంతీయ కార్యాలయంలో ఆ సంఘం జిల్లా కమిటీ ఆఫీస్ బేరర్ సమావేశం జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సైదులు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలని, స్కావెంజర్ లను నియమించాలని, విద్యార్థులకు యూనిఫాం, బాలికలకు ఆరోగ్య రక్షణ కిట్లూ అందజేయాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన రేట్లు పెంచి ఏజెన్సీలకు క్రమం తప్పకుండా బిల్లులు విడుదల చేయాలన్నారు. ఆ సంఘం జిల్లా అధ్యక్ష ,కార్యదర్శులు ఎడ్ల సైదులు, పి వెంకటేశం మాట్లాడుతూ జిల్లాలోని ఉపాధ్యాయుల అక్రమ డిప్యూటేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో డీఈఓ కార్యాలయం ముందు ప్రత్యక్ష కార్యాచరణ నిర్వహిస్తామని హెచ్చరిం చారు. ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బీ. శ్రీనివాసచారి, బి.అరుణ, కోశాధికారి శేఖర్ రెడ్డి, జే యాకయ్య, శ్రీనివాసరెడ్డి, పి రాజశేఖర్, మధుసూదన్ రెడ్డి, ఎం.మురళయ్య, కె.విజయలక్ష్మి, వెంకన్న, యాదయ్య పాల్గొన్నారు.