Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు
తుమ్మల వీరారెడ్డి
నవతెలంగాణ -నల్లగొండ
కేంద్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు తొలగించాలని చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య పిలుపునిచ్చారు. కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర కమిటీ పిలుపు మేరకు రెండు రోజుల సమ్మెలో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న సంక్షేమ బోర్డు వలస కార్మికుల చట్టం రద్దుచేసి కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తుందని విమర్శించారు. కార్మిక చట్టాల రద్దు, కార్పొరేట్ శక్తులకు అనుకూలమైన చర్యలను వ్యతిరేకించాలన్నారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి.సలీం, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి అద్దంకి నరసింహ, జిల్లా కమిటీ సభ్యులు పోలే సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు సాగర్ల మల్లయ్య, సుందరయ్య సెంట్రింగ్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు బచ్చల కూరి గురవయ్య, దేవరపల్లి వెంకట్ రెడ్డి, లింగయ్య పెయింటర్ యూనియన్ అధ్యక్షులు కాలనీ రమేష్, వివిధ రంగాల నాయకులు ఉర్సు వెంకటేశ్వర్లు, భీమనపల్లి శంకర్, వల్లపు లింగయ్య, సైద రాజు, బొంగరాల అంజయ్య, విజరు కుమార్ ,ఠాగూర్ కష్ణయ్య వేముల పెద్ద రాములు, తదితరులు పాల్గొన్నారు.